పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమం
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివేదిక గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు పశ్చిమలో 19 వేల బంగారు కుటుంబాలను గుర్తించి, ఇప్పటికే 11,800 కుటుంబాలకు మార్గదర్శకుల అనుసంధానం చేసినట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన విజన్ యాక్షన్ యూనిట్స్ & పీ-4 అంశం పై జరిగిన వీడియో...