అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
గుంటూరు, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అగ్రిగోల్డ్ బాధితులు సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ప్రదర్శన చేపట్టి, కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత సంఘం ప్రతినిధులు కొక్కెర శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్ళుగా అగ్రిగోల్డ్ బాధితులు అల్లాడుతున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చిన హనుమా వెంచర్లో ఉన్న ప్లాట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి...