BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 4:03 pm Posted by : BHARATH PRATHINIDHI

ప్రజా హక్కుల పరిరక్షణ సీపీఐ లక్ష్యం

సీపీఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీనురెడ్డి

గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీను రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దాసరిపాలెం చండ్ర రాజేశ్వరరావు నగర్ లో సిపిఐ ప్రచార ఆందోళన, పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు అధికారమే పరమావధి కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కృతంగా పోరాడుతారన్నారు. విద్యార్థి నుంచి కార్మికుడి వరకు, రైతు నుంచి మహిళల వరకు, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండి పోరాడేది సిపిఐ మాత్రమే అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు యువత గొంతు నొక్కే ప్రయత్నం అప్రజాస్వామిక మన్నారు. నిరుద్యోగం తాండవిస్తున్న మన దేశంలో యువతకు ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ధరల పెరుగుదల తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర, జిల్లా కార్యదర్సులు కామ్రేడ్ఆకిటి అరుణ్ కుమార్, కోట మాల్యాద్రి మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీన నగరంలోని గాంధీ పార్క్ వద్ద భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రచార బేరి నిర్వహిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాలన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గుంటూరు రూరల్ ప్రాంతమైన దాసరి పాలం చండ్ర రాజేశ్వరరావు నగర్ లో ప్రజలు అవస్థలను ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే రోడ్లు, సైడ్ కాలువలు, ఇంటింటికి అమృత పథకం కింద త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి వెంకటేశ్వరరావు, దేవా నాయక్, బి వెంకటేశ్వర్ రెడ్డి, సి ఆర్ నగర్ కమిటీ సభ్యులు షేక్ ఖాసిం, శివమ్మ, హుస్సేన్ బీ,మేరీ, ఖాసిం, శ్రీను, ట్రాక్టర్ శీను తదితరులు పాల్గొన్నారు.