పోస్టల్ శాఖ లో రాఖీ పండుగ సందర్భంగా విదేశాల్లోని ఆత్మీయులకు తపాలా శాఖ ప్రత్యేక సేవలు
పోస్టల్ సూపరింటెండెంట్ యు.యలమందయ్య గుంటూరు, 12 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అక్కాతమ్ముడు అన్నాచెల్లెళ్ల బంధానికి రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పౌర్ణమి వేడుకను పురస్కరించుకొని ఉద్యోగం,వ్యాపారం, చదువు నిమిత్తం విదేశాలలో ఉన్న సోదరులు, బంధువులు, ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు మరియు నిబంధనలకు లోబడి అనుమతించబడిన వస్తువులను పంపేందుకు గాను భారత తపాలా శాఖ అంతర్జాతీయ పార్సిల్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 28 న రాఖీ పౌర్ణమి జరుపుకోనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు...