దివ్యాంగుని ఇంటి వద్దకే ‘సర్’

* నోటీసులపై స్వయంగా వెళ్లి విచారించిన గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కిరణ్ కుమార్ * సంతోషం వ్యక్తం చేసిన దివ్యాంగుడు * అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నతహసీల్దార్ గుంటూరు, 19 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చక్రాల కుర్చీకి పరిమితమైన ఓ దివ్యాంగుడి ఓటు హక్కుకు ఆ అధికారి చొరవ ఊపిరి పోసింది. ఓటు హక్కు నిలిపేందుకు ముందుకు కదిలిన గుంటూరు పశ్చిమ తహసీల్దార్, ఏఈఆర్వో కిరణ్ కుమార్ ప్రయత్నానికి ప్రజాస్వామ్యం చిరునవ్వులొలికింది. తహసీల్దార్ చేసిన ప్రయత్నం తోటి...