గుంటూరు నగరంలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధం

కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై సోమవారం (17వతేదీ) నుండి పూర్తి స్థాయి నిషేధాన్ని అమలు చేసింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, వీధి వ్యాపారులు మరియు ప్రజలు నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ...