ఓటు హక్కు కోసం అడుక్కోవాలా ? : ప్రకాశ్ రాజ్

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : తన ఓటు హక్కు తొలగింపు వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన ఓటుకు సంబంధించి చిరునామా విషయంలో పొరపాటు జరిగిందని ఈసీ సిబ్బంది ముందుగా తనకు క్షమాపణలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాత అడ్రస్‌కు బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)ను పంపి కావాలనే వీడియోలు తీయించి, వాటిని మీడియా మరియు అధికార బీజేపీ...