గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి సామ్నా కృతజ్ఞతలు

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించి, జర్నలిస్టుల పక్షాన గళమెత్తిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కి స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (SSAMNA) గుంటూరు జిల్లా కమిటీ తరఫున అధ్యక్ష కార్యదర్శి రోళ్ళ రఘునాథ్ రెడ్డి, సి‌హెచ్. శ్రీనివాస్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో జర్నలిస్టుల...