అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలం : ఇద్వా
గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఇద్వా అధ్యక్షుడు గోళ్ళమూడి రాజసుందరబాబు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెద మక్కెన లాంటి గ్రామాల బాధితులకు 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని చెప్పారు. అత్యాచార బాధితులకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆర్ధిక పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టులు, ప్రభుత్వ జీవోలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు....