BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 8:21 am Posted by : BHARATH PRATHINIDHI

అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలం : ఇద్వా

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఇద్వా అధ్యక్షుడు గోళ్ళమూడి రాజసుందరబాబు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెద మక్కెన లాంటి గ్రామాల బాధితులకు 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని చెప్పారు. అత్యాచార బాధితులకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆర్ధిక పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టులు, ప్రభుత్వ జీవోలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రాజసుందరబాబు స్పష్టం చేశారు.