రోడ్డు భద్రతే లక్ష్యం.. 200 హెల్మెట్లు పంపిణీ

హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్‌ ట్రస్ట్‌ అవగాహన కార్యక్రమం గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు 200 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,...