అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోసుల సరస్వతి

అమరావతి, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గర్భిణీలు డాక్టర్లు సూచనలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వచ్చని జన చైతన్య సమితి నిర్వాహకులు భోజనంతోపాటు,పండ్లు పోషకాహారం పంపిణీ చేయటం అభినందనీయమని అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గోసుల సరస్వతి అన్నారు. జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత యోజన పథకం ద్వారా స్కానింగ్ పలు వైద్య పరీక్షలు నిమిత్తం వచ్చిన గర్భిణీలకు పెదకూరపాడు మండలంలోని బుచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన చండ్ర పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం భోజనంతోపాటు పోషకాహారాన్ని పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ల సూచనలను పాటించి ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, మానసిక ప్రశాంతతో పాటు శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని జనచైతన్య సమితి ప్రతినిధి షేక్ లియాకత్ ఆలీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్సి స్టాఫ్ నర్స్ పూదోట లిల్లీ రోజారాణి,జన చైతన్య సమితి కోఆర్డినేటర్ షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు భోజనంతోపాటు, రాగి జావా, కోడిగుడ్లు డ్రై ఫ్రూట్ లడ్లు, వేరుశనగ విత్తనాల చిక్కీలు, ఖర్జూర పండ్లు, బత్తాయి కాయలు, అరటి పండ్లను పంపిణీ చేశారు.