గుంటూరు నగరంలో విద్యుత్ కు అంతరాయం
గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంగళవారం ఉదయం గం. 09.00ల నుండి సాయంత్రం గం. 04.00ల వరకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ మరియు రాజేంద్రనగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పటాన్ హుస్సేన్ ఖాన్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురవయ్య సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.