BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:38 pm Posted by : BHARATH PRATHINIDHI

తెనాలిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పెమ్మసాని

తెనాలి, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని చెంచుపేట ప్రాంతంలో గల 30 31 వార్డులలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి శుక్రవారం పర్యటించారు. ప్రజలను నేరుగా కలిసి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరాలను తెలియజేస్తూ, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం పరుగులు పెడుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులకు రూ. 4 వేల పెన్షన్లను అందిస్తున్నాము. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు, తదితర సంక్షేమాలను అందరికి ప్రజలకు అందిస్తున్నాము. ప్రజలకు తాగు – సాగునీరుకు ఉపయోగపడే విధంగా హంద్రీనీవా, బనకచర్ల, పోలవరం, గుంటూరు ఛానల్ వంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకువస్తున్నాము. అయినా సరే ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? పథకాలు అందుతున్నాయా లేదా? వంటి ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఈ “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహిస్తున్నాము. శుక్రవారం తెనాలిలో 150 నివాసాలను స్వయంగా పరిశీలించి, వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. కూటమి ప్రభుత్వ పనితీరుపై 90% కు పైగా ప్రజలు సంతృప్తికరమైన అభిప్రాయాలను వెలిగిచ్చుతున్నారని తెలియజేశారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ, జూలై 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై, సంక్షేమం, అభివృద్ధిని అలాగే గత ప్రభుత్వం వైఫల్యాలు, మన ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకం అయ్యేందుకుగానూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఈరోజు మన తెనాలిలో పర్యటించారు. ప్రజల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ఈ కార్యక్రమంలో భాగంగా తెలుసుకుంటున్నామని తెలియజేశారు.