‘నేత్రదానం’ ఉద్యమంలో పాల్గొనండి.. ‘దృష్టి సందేశ దాత’ అవ్వండి
గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నేత్రదానం ఉద్యమంలో పాల్గొనండి. దృష్టి సందేశ దాత అవ్వండి, అని ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలులో భాగంగా పోస్టర్ లను శనివారం జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేత్రదానం గురించి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ సంక్షేమ సమితిలో అన్నివిధాలా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు చెప్పడం వల్ల ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుందన్నారు. నేత్ర దానం...