BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:30 pm Posted by : BHARATH PRATHINIDHI

నూతన కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల షోరూం ప్రారంభం

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్ లో నూతనంగా బుధవారం కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల దుస్తుల విక్రయ కేంద్రం ప్రారంభం కానుంది.షోరూం ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పెరుమాళ్ షోరూం యాజమాన్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. షోరూం కాంచీపురం, పట్టు దుస్తులకు ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రత్యేకంగా, నాణ్యత,స్పష్టత,నమ్మకంతో కూడిన చీరలను,ఇతర దుస్తులను మూడు అంతస్తుల లో కస్టమర్లకు అందుబాటులో ఉంచామన్నారు, యావత్ కస్టమర్లు లక్ష్మీపురంలోని కాంచీపురం షోరూమ్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముఖ్యంగా ఇతర కాంచీపురం షోరూంలో కంటే భిన్నంగా తమ షోరూమ్ లో వివిధ డిజైన్లతో,నాణ్యవంతమైన పట్టు వస్త్రాలను వినియోగదారులకు, సరసమైన ధరలలో అందిస్తున్నామని వెల్లడించారు. బుధవారం జరిగే పెరుమాళ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులతో పాటు, వస్త్ర ప్రియులు, కష్టమర్లంతా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.