మృత్యువు ఏ సమయంలో ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు ?

పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలోకాలువలో పడిన కారు.. నలుగురి గల్లంతు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇరగవరం మండలం ఆయిలంపూడి లాకుల వద్ద నియంత్రణ కోల్పోయిన ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతు కాగా, మరో వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఓగిడి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పెరవలిలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిలంపూడి లాకుల...