నిబ్బనుపూడి మురళీధరరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

ఘనంగా శతజయంతి వేడుకలు నిస్వార్థ సేవాభావం.. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు ఆదర్శం బాపట్ల, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, రంగస్థల కళాకారుడు, కవి నిబ్బనుపూడి లక్ష్మణ మురళీధరరావు శతజయంతి వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. చీలు రోడ్డు సెంటర్‌లోని కోన భవన్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మురళీధరరావు సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ మురళీధరరావు నిస్వార్థ సేవాభావం, పేదల పక్షాన...