ప్రాధమిక పాఠశాలకు విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు చేయూత

విజయవాడ, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్రాంత సెంట్రల్ ఎక్స్సైజ్, కస్టమ్స్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడిద నాగరాజు, తన ఉన్నతికి సోపానంగా నిలిచిన పాఠశాల అభివృద్ధికి అండగా నిలిచారు. సోమవారం విజయవాడ భవానిపురం లోని సీ.ఎస్.ఐ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా టెలివిజన్ ను నాగరాజు బహుమతిగా అందచేసారు. ఇదే పాఠశాల ఆవరణలో నాగరాజు నిర్మిస్తున్న ఒక షెడ్డు నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేసారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, నిఘంటువులను బహుకరించారు. తదంతరం...