మాజీ మంత్రి జోగి ఆరోపణలపై ఎమ్మెల్యే వసంత స్పందన
ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనవసర విషయాల్లో తాను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై ఇబ్రహీంపట్నంలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వసంత మీడియా ఎదుట స్పందించారు. శాసనసభ్యుల కార్యాలయానికి నిత్యం ఎంతోమంది వస్తుంటారని తెలిపారు. అదేవిధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధిగా తన కార్యాలయానికి ఎవరైనా రావచ్చని,...