BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 2:57 pm Posted by : BHARATH PRATHINIDHI

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి,గళ్ళా రామచంద్రరావు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి దంపతులకు వేదాశీర్వచనం అందజేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు, మహిళలు, యువత మరియు అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని, ప్రజలకు మరింత సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.