రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దాదాపు రూ.4,30,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జేకేసీ నగర్‌లో శేషయ్య హాస్పిటల్ వెనుక ప్రాంతంలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం 39వ డివిజన్‌లోని...