రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం 25వ డివిజన్ కొత్త కాలనీ మరియు 24వ డివిజన్ శాంతినగర్ ప్రాంతాల్లో మొత్తం రూ.3 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,...