BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 2:42 am Posted by : Raghunath Rolla

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

అమరావతి, భారత్ ప్రతినిధి న్యూస్ : పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలకలూరిపేట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు–ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం అత్యంత విషాదకరం. ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు మృత్యు ఒడికి చేరడం మనసును కలచివేస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణాలు గమ్యానికి చేర్చాలి కానీ, ఆఖరి మజిలీకి కాదు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.