జగ్గంపేట, 22 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుదిరెడ్డి శీను జగ్గంపేట శీను ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గెద్దా బాబురావు ఆధ్వర్యంలో శనివారం జగ్గంపేట లో ఉన్న నాగేశ్వర థియేటర్ ఆవరణలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో వీరాంజనేయ ఫిలిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బూర్లు సాయి కండ్రోతు బుజ్జి నరేష్ మండపాక శ్రీరామ్ మొగలి గంగాధర్ కృష్ణ లోకేష్ తదితరులు పాల్గొన్నారు