BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:32 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో ఘనంగా చిరు బీమా పాలసీల పంపిణీ

హాజరైన మండలనేని చరణ్ తేజ

గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మెగాస్టార్, పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని గుంటూరు దాక్షిణ్య క్యాంపస్‌లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘చిరు బీమా’ఇన్సూరెన్స్ పాలసీల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగానిర్వహించారు. సీనియర్ మెగా అభిమానుల సంక్షేమాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అఖిల భారత చిరంజీవి యువత ఆత్మీయ ఆహ్వానం మేరకు చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకులు, ప్రముఖ ప్రదాత మండలనేని చరణ్ తేజ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా సీనియర్ మెగా అభిమానులకు చిరు బీమా ఇన్సూరెన్స్ పాలసీలనుఅందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతోఅభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి బృహత్తర సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అభిమానుల పట్ల చరణ్ తేజచూపుతున్న ప్రేమాభిమానాలు, సేవా దృక్పథం ఇతరులకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.