BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 4:18 pm Posted by : BHARATH PRATHINIDHI

మద్యం మాఫియా డాన్ జగన్ : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మద్యం అక్రమాల వంటి దురాగతాలతో దొంగలు ముఠా నాయకుడిగా జగన్ ఎదిగారని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దీనికి నిదర్శనమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ విమర్శించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల విషయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అరెస్టు వైసీపీకి చెంపపెట్టు అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరుకు రవాణాలోనూ అక్రమాలలకు ఒడిట్టారన్నారు. మద్యం విక్రయాలలో ఇష్టరీతిగా వ్యవహరించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి నాయకులు కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మద్యం అక్రమాల ద్వారా వచ్చిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని, విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చారని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయంలో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, గత వైసిపి పాలనలో యువత భవితను గంజాయి మత్తులో నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు ముందున్నాయన్నారు.