భూముల బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలి
అనకాపల్లి జిల్లా బ్యూరో, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో భూముల బదలాయింపు ప్రక్రియకు సంబంధించి రైతుల అంగీకారం లేకుండా ఎలాంటి తీర్మానాలు చేయవద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామస్తులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నక్కపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి లెటర్ నం. 221/2026, తేదీ 26-07-2026తో జారీ చేసిన నోటీసును కాగిత గ్రామ సచివాలయంలో 10-08-2026న ప్రదర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు. నోటీసులో పేర్కొన్న భూములకు సంబంధించిన బదలాయింపు ప్రక్రియపై...