BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 1:55 pm Posted by : BHARATH PRATHINIDHI

భూ సమీకరణ వేగవంతం చేయాలి

గుంటూరు, 20 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  సి.ఆర్.డి.ఏ రెండవ విడత భూ సమీకరణలో భాగంగా రైతులకు అవగాహన కల్పించాలని, భూ సమీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. భూ సమీకరణపై సి.ఆర్.డి.ఏ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. నోటిఫై చేసిన  భూముల సమీకరణ ఆవశ్యమని అందుకు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ లు ఎ.భార్గవ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, సి.ఆర్.డి.ఏ డిప్యూటీ కలెక్టర్ లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.