BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:04 am Posted by : BHARATH PRATHINIDHI

కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ అభివృద్ధి నిధులు గోల్‌మాల్ !

వాకింగ్ ట్రాక్‌ సభ్యత్వం పేరుతో లక్షలు వసూలు
అమృత స్కీం మరియు జి‌ఎం‌సి నిధులతోనే అభివృద్ధి పనులు
వాకింగ్ ట్రాక్‌ ఆదాయం మాయం ?
సుమారు 40 లక్షల రూపాయలకు లెక్క ఏది ?
ప్రస్తుత కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు సభ్యుల సూటి ప్రశ్న ?
అభివృద్ధి నిధుల పై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం ?

గుంటూరు, 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాకింగ్ ట్రాక్‌ లు పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ మౌలిక వసతుల కల్పనకు భారీ నిధుల ప్రతిపాదనలు సిద్ధచేస్తుంటే.. మరోపక్క వాకింగ్ ట్రాక్‌ అభివృద్ధి నిధులు పక్కదారి పడుతున్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ అభివృద్ధి నిధులలో అవకతవకలు జరిగినట్లు వాకింగ్ ట్రాక్‌ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. సుమారు 60 లక్షల రూపాయలకు అభివృధి పనుల పేరుతో దారి మళ్ళీనట్లు వాకింగ్ ట్రాక్‌ సభ్యులు వాపోతున్నారు. కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌ ప్రస్తుత అధ్యక్షడు కన్నసాని బజ్జి వాకింగ్ ట్రాక్‌ సభ్యత్వం పేరుతో లక్షలు వసూలు చేశారని, పాత కమిటీ వారు ఉన్నప్పుడు మంజూరైన అమృత స్కీం మరియు జి‌ఎం‌సి నిధులతోనే అభివృద్ధి పనులు చేసి, సభ్యత్వం పేరుతో వసూలు చేసిన లక్షల రూపాయలు లెక్క ఏది ? అని కమిటీ సభ్యులు అధ్యక్ష కార్యదర్శి ని నిలదీసినా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని, ప్రస్తుత కమిటీ కాలపరిమితి ఈ నెల 24 వ తేదీన ముగియనున్న నేపధ్యంలో నిధుల మళ్లింపు విషయం స్థానికంగా చేర్చకు దారితీసింది.

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం ?
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాకింగ్ ట్రాక్‌ లు పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం మంచిదే.. కానీ, అభివృద్ధి నిధుల పై అధికారులు సమీక్ష నిర్వహించకపోవటం వల్ల అభివృద్ధి నిధులు దారి మల్లుతునాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.