BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 4:38 pm Posted by : BHARATH PRATHINIDHI

27న పల్నాడు జిల్లాలో ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమం

నరసరావుపేట, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్” కార్యక్రమం పల్నాడు జిల్లాలోని మామ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు ఏఏం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలలో ఘనంగా నిర్వహించనున్నారు అని ఉమ్మడి గుంటూరు జిల్లా మేరా యువ భారత్ ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అలాగే ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు, యువత ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించనున్నారు అని అలాగే స్థానిక క్రీడాకారులతో చర్చ, ప్రజాప్రతినిధుల ప్రసంగాలుతో పాటు జరిగే యువ సంవాద్ కార్యక్రమంలో యువత అభిప్రాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలను, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, 2036 ఒలింపిక్స్‌కు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దడం, క్రీడల ద్వారా యువతలో నాయకత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెంపొందించడం వంటి అంశాలపై చర్చించనున్నారు అని అలాగే వికసిత్ భారత్@2047 లక్ష్య సాధనలో యువత పాత్ర, యువతకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మరియు ఆర్థిక పరిజ్ఞానం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం, మేరా యువ భారత్ ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై కూడా యువత తమ అభిప్రాయాలను వెల్లడించే ఈ కార్యక్రమంలో భాగంగా యువతను మేరా యువ భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు, వారి సూచనలు డిజిటల్‌గా అందించేందుకు వేదిక వద్ద QR కోడ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలోని విద్యార్థులు, యువత క్రీడలు, ఫిట్‌నెస్, యువజన నాయకత్వం మరియు దేశ నిర్మాణం లో భాగం అవుతారు అని ఆమె పేర్కొన్నారు