ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి : చెరుకూరి తిరుపతిరావు

ఎస్పీకి మెమోరాండం అందజేసిన గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గుంటూరు జిల్లా ఎస్పీకి మెమోరాండం మంగళవారం సమర్పించారు. ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయని, సాదిక్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలను...