ఈవీఎం గోడౌన్‌లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లా లోని ఈ.వి.యం గోడౌన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం ఆవరణలో మరియు రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఇ.వి.యం గోడౌన్ లను నెలవారీ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్‌లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం...