గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లా లోని ఈ.వి.యం గోడౌన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం ఆవరణలో మరియు రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఇ.వి.యం గోడౌన్ లను నెలవారీ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ తాళాలు, సీల్‌లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోడౌన్ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె. ఖాజావలి, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.