జయహో బీసీ నినాదం కాదు.. టీడీపీ విధానం
ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 19 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : “జయహో బీసీ” అనేది కేవలం నినాదం కాదని, బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ విధానంలో అంతర్భాగమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది బీసీల రాజకీయ సాధికారతకు నూతన దిశానిర్దేశం చేస్తుందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని ఎమ్మెల్యే...