BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:10 am Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో ఐటీ సోదాలు..!

అరండల్‌పేటలో సీఏ దామ సుబ్రహ్మణ్యం నివాసంలో రెండు రోజులుగా సోదాలు

విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ బృందాలతో పాటు సెంట్రల్ IRS అధికారులు పాల్గొన్నట్లు సమాచారం

హార్డ్‌డిస్కులు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలన

ఓ ప్రముఖ కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం

కంపెనీ యజమానిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం

గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) దామ సుబ్రహ్మణ్యం నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపట్టిన సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నట్లు సమాచారం. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలతో పాటు సెంట్రల్ IRS అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది.

సోదాల్లో భాగంగా అధికారులు పలు కీలక పత్రాలు, ఫైళ్లు, హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఖాతాలకు సంబంధించి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సదరు కంపెనీ యజమానిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారులు పరిశీలిస్తున్న అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.