జర్నలిస్టులకు హౌసింగ్ సౌకర్యం కల్పించాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అమరావతి, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల జీరో అవర్‌లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజా సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతను నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విలేఖరుల్లో అధిక శాతం మంది అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నారని, సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి...