వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్వర్యంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’
గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యంత ఘనంగా "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ ప్రాంగణం నుండి నంబూరు గ్రామం వరకు 80 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా ర్యాలీని వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పొడవునా విద్యార్థులు చేసిన "భారత్ మాతాకీ జై" నినాదాలతో...