BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:46 am Posted by : Raghunath Rolla

తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

దేశ భాషలందు తెలుగు లెస్స..!

గ్రాంథిక భాషలో పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల నిత్య వ్యవహారంలోకి తీసుకొచ్చి, వాడుక భాషకు విశిష్టమైన స్థానం కల్పించిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషునిగా, బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, హేతువాదిగా తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అటువంటి మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం ప్రతి తెలుగువాడికీ గర్వకారణం. మన మాతృభాష తెలుగును ప్రేమిద్దాం.. పరిరక్షిద్దాం.. భావితరాలకు అందిద్దాం.

తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు