BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 7:22 pm Posted by : Raghunath Rolla

గుంటూరు శిల్పారామంలో హస్తకళల దుకాణాలు

గుంటూరు, 26 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో హస్తకళల నిలయమైన శిల్పారామంలో హస్తకళల అమ్మకానికి అనువైన దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పారామం పరిపాలనాధికారి యశ్వంత్ సాయి ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత, హస్తకళల కళాకారులు ప్రోత్సహించి వారి ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి నేరుగా విక్రయించుకునేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా శిల్పారామంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తిగల చేనేత, హస్తకళల కళాకారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఉత్పత్తుల ప్రదర్శనకు, అమ్మకాలకు ఉపయోగించుకోవాలని శిల్పారామం పరిపాలనాధికారి కోరారు. మరింత సమాచారం కొరకు యశ్వంత్ సాయి,శిల్పారామం కార్యాలయం, ఫోన్‌ నంబరు 8886652043 సంప్రదించవచ్చని వివరించారు.