BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:46 pm Posted by : BHARATH PRATHINIDHI

రాష్ట్ర కార్యవర్గంలో గుంటూరుకు సముచిత స్థానం

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ శుక్రవారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై సమర్థవంతమైన పోరాటం, రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. ఈ రాష్ట్ర కార్యవర్గంలో గుంటూరుకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సీనియర్ నాయకురాలు యడ్లపాటి స్వరూపరాణి సీనియర్ నాయకులు పాలపాటి రవికుమార్ లను నియమించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్ నారాయణ, జాతీయ స్పైసెస్ డైరెక్టర్ కొత్తూరి వెంకట సుబ్బారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, పలువురు బిజెపి నాయకులు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు.