గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్ ఏ వన్ పరీక్ష రాసిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ తరగతులకు తగ్గ సామర్థ్యాలు కలిగి ఉండాలన్నారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటి నుండే మంచి మార్కులు సాధించే విధంగా పోటీ తత్వంతో చదవాలన్నారు. ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.