BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:11 pm Posted by : BHARATH PRATHINIDHI

సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కాకినాడ బ్యూరో, 15 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో, విద్య రంగంలో ను సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కీలక పాత్ర అని ప్రిన్సిపల్ ఉత్తేజ్ డానియల్ అన్నారు. సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తూరంగి ప్రాంగణంలో, నూతన క్యాంపస్ జెడ్ భావారం కరప మండలంలో కూడా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నులపండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ కె. వరప్రసాద్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో విద్యార్థులు కష్టపడి చదువుకోవడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశం కోసం సేవ చేయాలనే స్ఫూర్తిని చిన్ననాటి నుంచే పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.