గుంటూరు నగరంలో ప్రదర్శనగా ప్రభుత్వ శకటాలు

గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వివిధ శాఖలు తయారు చేసిన శకటాలలో భాగంగా జిల్లాకు విచ్చేసిన శకటాలు ఆదివారం స్వామి థియేటర్ వద్దకు ప్రజల సందర్శనార్థం చేరుకున్నాయి. మధ్యాహ్నం నాటికి రింగ్ రోడ్ వెల్కమ్ హోటల్ ప్రాంతాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. సాయంత్రం ఆర్.టి.సి బస్ స్టాండ్ మీదుగా గుంటూరు పట్టణ పెరేడ్ గ్రౌండ్స్ కు ప్రదర్శనగా చేరుకున్నాయి. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.