BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:56 am Posted by : BHARATH PRATHINIDHI

2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు ?

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెస్ట్ (రెడ్ బాల్) క్రికెట్‌లో వస్తున్న వేగవంతమైన మార్పులు, కీలక ఆటగాళ్ల గాయాల సమస్యలను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ప్రస్తుతానికి గంభీర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని భావిస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం గంభీర్‌ను పదవి నుంచి తప్పించకపోవడానికి రెండు ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. రెడ్ బాల్ క్రికెట్‌లో టీమ్ ప్రస్తుతం బిగ్ ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందనే విషయాన్ని బిసిసిఐ యాజమాన్యం యాక్సెప్ట్ చేస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి లెజెండరీ ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేయడంతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో యంగ్ టీమ్ రూపుదిద్దుకుంటోంది. ఈ టైమ్ లో కోచ్‌ను మార్చడం కరెక్ట్ కాదని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీంఇండియా కొత్త తరం జట్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ క్రమంలో స్థిరమైన ఫలితాలు సాధించడానికి గంభీర్‌కు కొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ పూర్తయ్యే వరకు గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.