BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 1:58 am Posted by : BHARATH PRATHINIDHI

కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తిస్థాయి నిధులు

మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు

ఇబ్రహీంపట్నం, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కి పూర్తిస్థాయి నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శనివారం మున్సిపాలిటీ 7వ డివిజన్ లో 15 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చైర్మన్ పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అభివృద్ధికి అవసరమైన నిధులను సమీపిస్తున్నారని అందులో భాగంగా డిఎంఎఫ్టి నిధులతో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బసవ ఉమామహేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు కరిమకొండ బాలాజీ, టిడిపి నాయకులు కుమ్మరి శ్రీనివాసరావు, చుట్ట కుదురు వాసు, నీలం జాన్ బాబు ,కూరేటి చక్రవర్తి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.