గుంటూరు, 13 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80వ స్వాతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ బి. రాజకుమారి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పోలీస్ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పెరేడ్ కమాండర్ గా వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఏ ఎస్ పి యు విభూ కృష్ణ వ్యవహరిస్తుండగా, పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ గా 14వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ మహబూబ్ బాషా, పెరేడ్ ఎడ్జ్టెంట్ గా 14వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ టి రాఘవేంద్ర వ్యవహరిస్తున్నారు.