BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:35 pm Posted by : BHARATH PRATHINIDHI

రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా

వైసీపీ మైనారిటీ నాయకులు

గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈమేరకు వైసీపీ మైనారిటీ నాయకులు మహమూద్, అబీద్ బాషా, అఫ్సర్, ఇలియాఖత్, సైదాఖాన్, అబ్దుల్లా ఖాన్ తదితరులు మీడియాతో శుక్రవారం మాట్లాడారు. వ్యాపారాల్లో ముస్తఫా బిజీ అయిన కారణంగానే కుమార్తె నూరీ ఫాతిమాను రాజకీయ వారసురాలిగా తీసుకు వచ్చారని చెప్పారు. టీడీపీ బెదిరింపులకు ఫాతిమా భయపడే వ్యక్తి కాదన్నారు. దమ్ముంటే ముస్తఫా పై మోపిన నేరాన్ని రుజువు చేయాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం ఒత్తిడితోనే పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని వారు వెల్లడించారు. ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైందని, త్వరలోనే కూటమి నేతలకు బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ముస్తఫా, నూరి ఫాతిమా ను కట్టడి చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.