BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 2:04 pm Posted by : BHARATH PRATHINIDHI

వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

23వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరణ

గుంటూరు, 20 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు యస్.వెంకటరవనప్ప తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బాపట్ల జిల్లా వెదుల్లపల్లి వద్ద ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నుండి అనుమతి మంజూరు చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారని పేర్కొన్నారు. ప్రస్తుత 2026 – 27 విద్యా సంవత్సరంలో 30 సీట్లతో ఏ.ఐ (AI) సర్టిఫికేషన్ కోర్సుతో బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రధాన సబ్జెక్టుగా) కోర్సును అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థిని విద్యార్ధుల ఈ నెల 23వ తేదీ నుండి దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. వివరాలకు 9000013633/ 9948372899 పోన్ నంబర్లకు సంప్రదించవచ్చని వివరించారు.