BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 1:53 am Posted by : BHARATH PRATHINIDHI

జి.ఎస్.టి చెల్లించని వారిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలి : జేసీ

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వానికి జి.ఎస్.టి చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర జీఎస్.టి లక్ష్యాలను సాధించుటకు పక్కా ప్రణాళికలు రూపోందించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జీ.ఎస్.టి వసూళ్ళపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల మద్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరం నకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పనులు పూర్తీ చేసిన అనంతరం బిల్లులు అప్ లోడ్ చేసే సమయంలో జీ.ఎస్.టి వివరాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జి.ఎస్.టి చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలని అందుకు తగిన సమాచారంతో శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జి.ఎస్.టి జాయింట్ కమిషనర్ గీతా మాధురి మాట్లాడుతూ, జి.ఎస్.టి చెల్లించని సంస్థల బ్యాంక్ ఖాతాల వివరాలు అందించాలని కోరుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, జిల్లా ఎస్.జి.ఎస్.డబ్ల్యూ అధికారి రామలింగ రెడ్డి, నగర పాలక సంస్థ ఇఇ సుందరరామి రెడ్డి, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు, ఇతర శాఖల అధికారులు, జీ.ఎస్.టి. అధికారులు తదితరులు పాల్గొన్నారు.